AP: రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలకు నిధులు విడుదల చేసింది. 11 జిల్లాలకు రూ.14 కోట్లు విడుదల చేస్తూ నిర్ణయం తీసుకుంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆహారం, నిత్యావసరాలు, ఇతర సదుపాయాల కోసం ఈ నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.