TPT: పుట్టపర్తి పట్టణంలోని ప్రశాంతి-2 ప్రాంతంలో ఆదివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్తు సరఫరా నిలిపివేయనున్నట్లు ఏఈ సాయినాథ్ తెలిపారు. సత్యసాయి శత జయంతి వేడుకల సందర్భంగా చేపడుతున్న విద్యుత్ నిర్వహణ పనుల కారణంగా ఈ అంతరాయం జరుగుతుందని అధికారులు ప్రజలకు తెలియజేశారు.