TG: నిజామాబాద్ జిల్లాలోని బర్దిపూర్ వద్ద ‘జాగృతి జనంబాట’ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని జాగృతి అధ్యక్షురాలు కవిత ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘మళ్లీ ప్రజల్లోకి రావాలనుకున్నా. తొలి అడుగు నిజామాబాద్ నుంచి మొదలుపెడుతున్నా. ప్రజా సమస్యలు, పథకాల అమలుపై పోరాడాల్సి ఉంది. అమరుల కుటుంబాలకు రూ. కోటి పరిహారం కోసం జాగృతి పోరాటం చేస్తుంది’ అని అన్నారు.