PPM: ఇంకెంత మంది గిరిజన విద్యార్థులు మరణించాలి..? అని రాష్ట్ర ప్రభుత్వాన్ని గిరిజన సంక్షేమ సంఘం ఉత్తరాంధ్ర ప్రధాన కార్యదర్శి పాలక రంజిత్ కుమార్ ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు మన్యం జిల్లాలో 14 మంది గిరిజన విద్యార్థులు మరణించారని కనీసం పరిహారం ఇవ్వడం గాని, ఆ కుటుంబాలను ఆదుకోవడం గాని ప్రభుత్వం చేయక పోవడం చాలా దుర్మార్గం అన్నారు.