TG: ఢిల్లీలో ఏఐసీసీ పెద్దలతో సీఎం రేవంత్ భేటీ కానున్నారు. ఈ సమావేశంలో ఆయనతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ పాల్గొననున్నారు. మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో రాష్ట్ర డీసీసీ అధ్యక్షుల ఎంపికపై చర్చించనున్నారు. అనంతరం AICC పరిశీలకుల నివేదికను సమర్పించే అవకాశం ఉంది. ఈ నెలాఖరు నాటికి డీసీసీల ఎంపిక ప్రక్రియ పూర్తికానున్నట్లు సమాచారం.