ATP: బొమ్మనహల్ మండలం దర్గా హోన్నూరులో కొత్తగా నిర్మించిన 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌ను MLA కాలవ శ్రీనివాసులు ప్రారంభించారు. రాయదుర్గం త్వరలోనే సోలార్ పవర్ హబ్‌గా మారుతుందని ఆయన తెలిపారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం విద్యుత్ ఉత్పత్తిలో ఆత్మనిర్భరంగా మారుతోందని, రాయదుర్గం పరిధిలో 7500 మెగావాట్ల సోలార్ ప్లాంట్ రూపుదిద్దుకుంటోందని పేర్కొన్నారు.