GDWL: కెటీ దొడ్డి మండల కొండాపురం గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించాలని జిల్లా కలెక్టర్, సివిల్ సప్లయ్ అధికారులను రైతులు కోరారు. అలాగే రైతుల ఖాతాలో గత సీజన్ వరి బోనస్ జమ చేయాలని అన్నారు. ఎప్పటికప్పుడు కొనుగోలు కేంద్రాలను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలి అని కష్టపడి పండించిన వరి ధాన్యంను ఎలాంటి కటింగ్ లేకుండా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.