W.G: ఉప్పునీటి ఆక్వా సాగు చెరువులు తప్పనిసరిగా కోస్టల్ ఆక్వాకల్చర్ అథారిటీ CAA కింద రిజిస్టర్ కావాలని కలెక్టర్ నాగరాణి అన్నారు. ఇవాళ కలెక్టరేట్లో జరిగిన జిల్లాస్థాయి సమావేశంలో ఆమె మాట్లాడుతూ. రిజిస్టర్ కాని చెరువులకు చట్టబద్ధత ఉండదని, సీఏఏ మార్గదర్శకాలకు అనుగుణంగానే ఆక్వా సాగు నిర్వహించాలని సూచించారు. నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.