ATP: జిల్లాలో నేరాల నియంత్రణ, భద్రత పర్యవేక్షణలో భాగంగా డ్రోన్ నిఘాను పోలీసులు ముమ్మరం చేశారు. ఐజీ ఆకే రవికృష్ణ ఆదేశాలు, ఎస్పీ జగదీష్ సూచనల మేరకు 3 టౌన్ పరిధిలోని మార్కెట్ యార్డులు, కేసీ కాలువ ఒడ్డులు, రైల్వే ట్రాక్ పరిసరాల్లో డ్రోన్ సర్వైలెన్స్ నిర్వహించారు. డ్రోన్ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు పలు అనుమానాస్పద స్థలాలను క్షుణ్ణంగా పరిశీలించారు.