NLG: కొండమల్లేపల్లి మండల కేంద్రానికి చెందిన అందుగుల తేజశ్రీ నీట్ ఫలితాల్లో ర్యాంకు సాధించి రామగుండం ప్రభుత్వ మెడికల్ కళాశాలలో MBBS సీటు సాధించింది. ఆమెది నిరుపేద కుటుంబం కావడంతో ఫీజు కట్టలేక కూలి పనులకు వెళ్తోంది. ప్రభుత్వ టీచర్ గురిజ మహేష్ ద్వారా విషయం తెలుసుకున్న సామాజిక సేవకులు శ్రీ వ్యాల్, తేజశ్రీ చదువు కోసం రూ. 82 వేల ఆర్థిక సాయం అందజేశారు.