ATP: కార్తీక మాసం తొలి సోమవారం సందర్భంగా బుగ్గ రామలింగేశ్వరస్వామి క్షేత్రం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. కర్ణాటక నుంచి తెప్పించిన వివిధ రకాల పుష్పాలతో పాటు, గర్భగుడిని ప్రత్యేకంగా కలువ పువ్వులతో అలంకరించారు. తెల్లవారుజామున 3 గంటలకు స్వామివారికి అభిషేకం నిర్వహించారు. ఉ.4 గంటల నుంచే భక్తులకు దర్శనభాగ్యం కల్పిస్తున్నారు.