ATP: జిల్లాకు ఈనెల 28న ఏపీ శాసనసభ సాంఘిక సంక్షేమ కమిటీ రానుందని కలెక్టర్ ఆనంద్ తెలిపారు. కమిటీ అధ్యక్షుడు వర్ధర రాజు, సభ్యులు కొండ్ర మురళి, శ్రీనివాసరావు, చంద్రశేఖర్, దేవి వరప్రసాద్ తదితరులు ఉదయం 9.30 నుంచి 11 గంటల వరకు అనంత ఆర్డీవో కార్యాలయంలో ప్రజల నుంచి అర్జీల స్వీకరిస్తారని, అనంతరం జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహిస్తారని చెప్పారు.