BHPL: అవినీతి అనేది పనిచేసే సంస్థ ఎదుగుదలను అడ్డుకుంటుందని, ప్రతి ఉద్యోగి నిజాయితీతో బాధ్యతలు నిర్వార్తించాలని సింగరేణి భూపాలపల్లి ఏరియా జీఎం రాజేశ్వర్ రెడ్డి అన్నారు. స్థానిక జీఎం కార్యాలయంలో సోమవారం నిర్వహించిన విజిలెన్స్ అవగాహన వారోత్సవాలు 2025 కార్యక్రమాన్ని జీఎం ముఖ్యఅతిధిగా, ప్రాజెక్ట్, ప్లానింగ్ జీఎం సాయిబాబు విశిష్ట అతిధిగా పాల్గొని ప్రారంభిచారు.