MHBD: తొర్రూరు మండల కేంద్రంలో సోమవారం వ్యవసాయ కార్మికుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఎండి.యాకుబ్ మాట్లాడుతూ.. పెరిగిన ధరలకు అనుగుణంగా వ్యవసాయ కూలీలకు కనీస వేతనాల జీవో సవరించి రోజు కూలీ రూ.800 ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేనియెడల ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.