ప్రకాశం: మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రభుత్వ మెడికల్ కాలేజిలు ప్రైవేటికరణ చేయడాన్ని నిరసిస్తూ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం అర్ధవీడు మండలంలోని కాకర్ల గ్రామంలో జరిగింది. ఈ కార్యక్రమంలో గిద్దలూరు వైసీపీ ఇన్ఛార్జ్ కెపి నాగార్జున రెడ్డి, అర్ధవీడు మండలం ఎంపీపీ వెంకట్రావు, మండల కన్వీనర్ రంగారెడ్డి, వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.