ADB: ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో పత్తి కొనుగోళ్లు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. క్వింటాల్ సీసీఐ పత్తి ధర రూ.8110గా, ప్రైవేట్ పత్తి ధర రూ.6950గా నిర్ణయించినట్లు వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు తెలిపారు. తేమ శాతంతో సంబంధం లేకుండా పత్తి కొనుగోలు చేయాలని రైతు సంఘాల నాయకులు, రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.