ప్రకాశం: మొంథా తుఫాన్ నేపథ్యంలో వాతావరణ శాఖ జారీ చేసిన హెచ్చరికలను దృష్టిలో ఉంచుకుని ఒంగోలులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఇవాళ నిర్వహించవలసిన ‘మీకోసం’ కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేసినట్లు ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వాగులు వంకలు దాటే సమయంలో జాగ్రత్త వహించాలన్నారు.