NZB: మద్యం షాపుల టెండర్లకు నిజామాబాద్ జిల్లా ఎక్సైజ్ శాఖ అధికారులు ఇవాళ లక్కీ డ్రా తీయనున్నారు. జిల్లాలోని 102 లిక్కర్ షాపులకు 2,786 దరఖాస్తులు వచ్చాయి. దీనితో జిల్లా ఎక్సైజ్ శాఖకు ఒక్కో టెండర్‌కు రూ.3 లక్షల చొప్పున రూ. 83.58 కోట్ల ఆదాయం లభించింది. లక్కీడ్రాలో అదృష్టం ఎవరిని వరించనుందో చూడాలి.