ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో రోహిత్ శర్మ 63 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్సర్ సహాయంతో తన అర్ధశతకాన్ని పూర్తి చేసుకున్నాడు. ఈ సిరీస్‌లో రోహిత్‌కు ఇది వరుసగా రెండో హాఫ్ సెంచరీ. ఈ క్రమంలో, ఆస్ట్రేలియాపై వన్డేలలో 2500 పరుగులు సాధించిన రెండో భారత బ్యాటర్‌గా అరుదైన రికార్డును నెలకొల్పాడు. ఇప్పటివరకు ఈ ఘనతను సచిన్ టెండూల్కర్ మాత్రమే సాధించాడు.