తూ.గో జిల్లాలో ప్రాథమిక రంగానికి అనుబంధ పరిశ్రమలను స్థాపించే దిశగా అధికారులు ఔత్సాహికులను చురుకుగా ప్రోత్సహించాలని కలెక్టర్ కీర్తి చేకూరి సూచించారు. శనివారం రాజమండ్రిలో జరిగిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. వ్యవసాయ, ఉద్యానవన శాఖలు పోస్ట్ హార్వెస్టింగ్ యూనిట్లు, పశుసంవర్ధక శాఖ డైరీ & పాల ఉత్పత్తుల పరిశ్రమలు, మత్స్య శాఖకు ప్రోత్సాహం ఇవ్వాలని కలెక్టర్ పేర్కొన్నారు.