మహబూబ్నగర్ జిల్లా హన్వాడ మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి శనివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో భోజనం ఎలా ఉందని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులు ఎలా చదువుకుంటున్నారని ప్రశ్నించారు. పాఠశాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.