తన పేరు, ఫొటోలను దుర్వినియోగం చేస్తున్నారని హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టును మెగాస్టార్ చిరంజీవి ఆశ్రయించారు. ఈ క్రమంలో ఆయన పేరు, ఫొటో, వాయిస్, చిత్రాలను అనుమతి లేకుండా వాడకూడదని కోర్టు ఆదేశించింది. వాణిజ్య ప్రయోజనాల కోసం చిరు పేరు వినియోగించవద్దని హెచ్చరించింది. తదుపరి విచారణను అక్టోబర్ 27కి వాయిదా వేసింది.