AKP: రాజయ్య పేటలో బల్క్ డ్రగ్ వర్క్ ఏర్పాటు అయితే ఎన్నో అనర్థాలు జరుగుతాయని విశ్రాంత ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రధాని విశాఖలో ఈ పార్క్ ప్రారంభించిన సందర్భంలో దానివల్ల జరిగే అనర్ధాలపై హెచ్చరించడం జరిగిందన్నారు. అభిప్రాయ సేకరణలో స్థానికులు అభ్యంతరాలు తెలియజేయడానికి ప్రయత్నించినప్పుడు అధికార బలంతో వారిని అడ్డుకున్నారని తెలిపారు.