GNTR: భారీ వర్షాల కారణంగా తాడేపల్లి ప్రకాశం బ్యారేజీ వద్ద నీటిమట్టం పెరుగుతోంది. శనివారం సాయంత్రం వరకు బ్యారేజీ వద్ద 11.6 అడుగుల నీటిమట్టం నమోదైంది. బ్యారేజీకి 85,360 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా, మెయిన్ కెనాల్‌కు 511 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. బ్యారేజీ వద్ద మొత్తం నీటి పరిమాణం 85,871 క్యూసెక్కులుగా ఉందని అధికారులు తెలిపారు.