KDP: పోరుమామిళ్ల పట్టణంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని శనివారం ఎమ్మెల్సీ DC గోవిందరెడ్డి సందర్శించారు. 4 రోజుల క్రితం కాకినాడ జిల్లా తునిలో ఒక బాలికపై జరిగిన అత్యాచార యత్నం ఘటనకు సంబంధించి సాంకేతిక భద్రతా పరిస్థితులను పరిశీలించామన్నారు. విద్యార్థులకు, సిబ్బందికి ఇలాంటి ఘటనలపై అప్రమత్తంగా ఉండాలని సలహాలు సూచనలు అందించారు.