ASR: కంపెనీలు, ఆర్థిక రంగ సంస్థలు ఎలా పనిచేస్తాయన్న అంశాలపై అవగాహన ఉండాలని కొయ్యూరు తపాలా అధికారి శ్యామ్ విద్యార్థులకు సూచించారు. ఇండస్ట్రియల్ విజిట్లో భాగంగా, శనివారం గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు తపాలా శాఖ విధుల గురించి వివరించారు. తపాలా కార్యాలయంలో జరుగుతున్న బ్యాంకింగ్, ఫైనాన్షియల్, ఇన్సూరెన్సు అంశాలపై అవగాహన కల్పించారు.