WG: తుపాన్ విపత్తును ఎదుర్కొనేందుకు అధికారులంతా సిద్ధంగా ఉండాలని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కోరారు. ఇవాళ సాయంత్రం తాడేపల్లిగూడెం క్యాంపు కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్షించారు. రెండు రోజులుగా కురిసిన వర్షాలకు చేలల్లో నీటిని బయటకు పంపేలా రైతులను అప్రమత్తం చేయాలన్నారు. శిథిల భవనాల్లో ఉన్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు.