BDK: పోడియం రాము, తాపర్ల వెంకటేష్, అనిల్, ఉంగయ్య అనే ముగ్గురు వ్యక్తులు చేతబడి నేపంతో పద్దం నందయ్యను హతమార్చారని టూటౌన్ సీఐ ప్రతాప్ శనివారం తెలిపారు. ఈనెల 22న చుంచుపల్లి మండలం మర్రిగూడెం గ్రామంలో జరిగిన హత్య కేసుపై సీఐ మాట్లాడారు. పోడియం రాము కుమారుడు అనారోగ్యం బారిన పడగా, దానికి మృతుడు పద్దం నందయ్య చేతబడి చేశారని అనుమానంతో చంపినట్లు తెలిపారు.