VSP: నగర పోలీస్ కమీషనర్ శంఖబ్రత బాగ్చి శనివారం రివ్యూ మీటింగ్లో ప్రతి స్టేషన్ ఇన్స్పెక్టర్ పనితీరును పరిశీలించారు. రౌడీ షీటర్లు, NDPS రవాణా, ట్రాఫిక్, క్రైమ్, లా & ఆర్డర్, పొక్సో, సైబర్, ఉమెన్ సేఫ్టీ సంబంధిత చర్యలు పటిష్టంగా చేపట్టాలని, అన్ని స్టేషన్లలో విజిబుల్ పోలీసింగ్, డికొయ్ టీంలు, కేసుల త్వరిత పరిష్కారం, పూర్తి పారదర్శకత పాటించాలని సూచించారు.