KRNL: ఆలూరు మండలం మొలగవెల్లిలో కోటి సంతకాల సేకరణ రచ్చబండ కార్యక్రమాన్ని MLA బుసినే విరుపాక్షి నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జగన్ 17 కాలేజీలను తీసుకునివస్తే.. కూటమి ప్రభుత్వం వాటిని ప్రైవేటీకరణ చేసేందుకు కుట్ర చేస్తుందని మండిపడ్డారు. మెడికల్ కాలేజీలను కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తే పేద విద్యార్థులకు వైద్యవిద్య దూరమవుతుందని ఆరోపించారు.