VSP: విశాఖలోని డాక్టర్ బీ.ఆర్.అంబేడ్కర్ గురుకుల కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్న చింతకాయల అభి క్రీడా ప్రతిభతో జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. ఈ నెల 22, 23 తేదీలలో ఏలూరు జిల్లా పెదవేగిలో జరిగిన రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ అథ్లెటిక్ పోటీలలో ఆయన ఈ ఘనత సాధించాడు. అభిని శనివారం ప్రిన్సిపాల్ రత్నవల్లి అభినందించారు.