KDP: మొంథా తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో ఈ నెల 27, 28 తేదీలలో జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు సెలవులు ప్రకటిస్తున్నట్లు కడప JC అదితి సింగ్ శనివారం తెలిపారు. తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఆదివారం కూడా సెలవు కావడంతో వరుసగా 3 రోజులు సెలవులు వచ్చాయి.