BDK: మణుగూరు మండలం తోగ్గుడెం వద్ద కారు ప్రమాదంలో సమితి సింగారం గ్రామానికి చెందిన చంద్రుపట్ల కృష్ణారెడ్డి మృతి చెందారు. కాగా శనివారం విషయం తెలుసుకున్న పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు 100 పడకల హాస్పిటల్లో ఉన్న కృష్ణా రెడ్డి పార్తివదేహాన్ని సందర్శించారు. ప్రమాదంలో మృతుడికి తగిలిన గాయాల గురించి వైద్యులను వివరాలు అడిగారు. అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చారు.