SRCL: చందుర్తి మండలంలోని ఆశిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన చేకుట రమేష్- సుమలతల కూతురు వేదాన్సీ 18 నెలల బాలిక ఇంటి ముందు ఆడుకుంటూ ఉండగా శనివారం రాత్రి పాము కాటుకు గురైంది. ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్ తెలిపినట్లు స్థానికులు పేర్కొన్నారు. చిన్నారి మృతితో కుటుంబంలో విషాదం నిండుకుంది.