CTR: రోగులకు మెరుగైన వైద్య సేవలు అందేలా సిబ్బంది చర్యలు తీసుకోవాలని DCHS పద్మాంజలి దేవి ఆదేశించారు. సదుంలో ఉన్న సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని శనివారం ఆమె తనిఖీ చేశారు. ఇందులో భాగంగా రోగులకు అందుతున్న సేవలను ఆరా తీశారు. వాతావరణ ప్రభావంతో విష జ్వరాలు ప్రబలుతుండటంతో అప్రమత్తంగా ఉండాలని సమావేశంలో సిబ్బందికి సూచించారు.