AUSతో మ్యాచ్ తర్వాత రోహిత్, కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రోహిత్ మాట్లాడుతూ.. ‘సెంచరీ చేయడం చాలా సంతోషంగా ఉంది. మళ్లీ ఆసీస్ గడ్డపై ఆడుతానో లేదో తెలియదు. కానీ ఇక్కడ ఆడటం మాత్రం పూర్తిగా ఆస్వాదిస్తాను’ అని పేర్కొన్నాడు. ఇక కోహ్లీ స్పందిస్తూ.. ‘రోహిత్‌తో కలిసి బ్యాటింగ్ చేయడాన్ని ఎంజాయ్ చేస్తాను. మేము ఇద్దరం ఒకరినొకరు చాలా బాగా అర్థం చేసుకుంటాం’ అని తెలిపాడు.