HYD: సృష్టి ఫెర్టిలిటీ కేంద్రం కేసులో కీలక నిందితురాలు డా. నమ్రత, మరో నిందితురాలు కల్యాణిని ఈడీ అధికారులు శనివారం మహిళా జైల్లో ప్రశ్నించారు. నమ్రత ఆస్తులను ఎలా కొన్నారు..? ఎంతమంది చిన్నారులను కేంద్రం ద్వారా జన్మించినట్లు తెలిపారు..? ఎంత మంది తల్లిదండ్రులకు పిల్లలను ఇచ్చారనే వివరాలను అడిగారు.