వనపర్తి: మదనపురం మండలం దంతనూరు గ్రామ శివారులో ఉన్న సరళ సాగర్ ప్రాజెక్టు నిండుకుండలా మారింది. గత రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాజెక్టు సైఫన్ గేట్లు మరో మారు ఆటోమేటిక్గా తెరుచుకున్నాయి. ఈ సందర్భంలో నీటిపారుదల శాఖ అధికారులు పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. వాగు పరిసర ప్రాంతాలలోకి పశువులను తీసుకెళ్లకూడదన్నారు.