VKB: జిల్లాలోని అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో జిల్లా విద్యాధికారి రేణుకా దేవి ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు యాజమాన్య విద్యా సంస్థలకు జిల్లాలో నెలకొన్న తుఫాను, భారీ వర్ష పరిస్థితుల దృష్ట్యా బుధవారం సెలవు ప్రకటించినట్లు తెలిపారు. అన్ని విద్యా సంస్థలు సెలవు ఉత్తర్వులను పాటించాలన్నారు.