తూ.గో: నిడదవోలు మండలం పెండ్యాల గ్రామంలో మంగళవారం రాత్రి వీచిన ఈదురు గాలులకు అరటి తోటలు దెబ్బతిన్నాయి. గ్రామానికి చెందిన మాన్యం వెంకట దుర్గారావు అనే రైతుకి చెందిన ఎకరం పొలం అరటి తోట పూర్తిగా నేలకొరిగింది. పంట చేతికందే సమయంలో గెలలతో ఉన్న తోట కూలిపోవడంతో రైతు కన్నీటి పర్యంతం అవుతున్నారు. రూ.లక్షకు పైగా పెట్టుబడి పెట్టిన పంట పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.