AP: తుఫాన్ ప్రభావంతో విరిగిపడిన చెట్లు, విద్యుత్ స్తంభాలను తొలగించాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. తుఫాన్ ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో పవన్ సమీక్ష నిర్వహించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ చర్యలు చేపట్టాలన్నారు. ప్రజలను సురక్షిత ప్రదేశాల్లోనే ఉంచాలని సూచించారు. పునరావాలస కేంద్రాల్లో ఆహారం, వసతి కల్పించాలని స్పష్టం చేశారు.