VKB: మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ రాజేష్ రెడ్డి అన్నారు. శుక్రవారం బొంరాస్ పేట మండలంలోని పెద్ద చెరువులో 1.04 లక్షల చేప పిల్లలను వదిలారు. జిల్లా మత్స్యశాఖ అధికారి వెంకయ్య మాట్లాడుతూ.. జిల్లాలోని 778 చెరువుల్లో 1.29 కోట్ల చేప పిల్లలను వదులుతున్నట్లు తెలిపారు. మత్స్యకారులు వీటి ద్వారా ఉపాధి పొందాలన్నారు.