KDP: జిల్లాలో సెంట్రలైజ్డ్ స్మార్ట్ కిచెన్ల ఏర్పాటును వేగవంతం చేసి, డిసెంబర్ మొదటి వారం నాటికి అన్ని మండలాల్లో ప్రారంభించాలని కలెక్టర్ శ్రీధర్ ఆదేశించారు. శుక్రవారం కడపలోని జిల్లా సచివాలయంలో జేసీతో కలిసి భవన నిర్మాణాల పురోగతిపై సమీక్షించారు. జిల్లాలో 33 స్మార్ట్ కిచెన్లలో 23నిర్మాణం కొనసాగుతోందన్నారు. మిగిలిన 10 నిర్మాణాలను తక్షణం ప్రారంభించాలని సూచించారు.