KRNL: ఎమ్మిగనూరు వ్యవసాయ మార్కెట్ యార్డులో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. గుర్తుతెలియని దుండగులు ఖాళీ సంచులకు పెట్రోల్ పోసి నిప్పు పెట్టడంతో మంటలు భారీ ఎత్తున ఎగసి పడుతున్నాయి. స్థానికులు గుర్తించి వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించడంతో వారు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.