CTR: కాణిపాకం కాలనీ హౌసింగ్ విభాగంలో బుధవారం ఉదయం గ్యాస్ సిలిండర్ పేలిన ఘటన సంచలనంగా మారింది. ఈ ఘటనలో చిన్న పాపమ్మకు గాయాలు అయినట్లు సమాచారం. క్షతగాత్రురాలిని తక్షణమే చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పేలుడు కారణంగా ఇంటి గోడలు, పైకప్పు భాగం దెబ్బతిన్నట్లు స్థానికులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.