KRNL: కోసిగి మండలం ఆర్లబండ గ్రామానికి చెందిన వివాహిత శకుంతల(40) పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. భార్యాభర్తలు నిన్న రాత్రి గొడవ పడగా ఆమే మనస్తాపానికి గురై ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగు మందు తాగినట్లు వారు తెలిపారు. వెంటనే స్థానికులు చికిత్స నిమిత్తం ఆదోని ఆసుపత్రిలో చేర్పించే సమయంకి మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు.