AP: పెద్ద తుఫాన్ వచ్చినా ప్రాణనష్టం తప్పిందని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు తీసుకున్న జాగ్రత్తలతోనే సాధ్యమని, విపత్తులను సమర్థంగా డీల్ చేయగల వ్యక్తి చంద్రబాబు అన్నారు. ఉమ్మడి తూర్పు గోదావరిలో ఆస్తినష్టం లేకుండా చేయగలిగామని, పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా కల్పించారు. పంటనష్టం ఏ స్థాయిలో జరిగిందో క్షేత్రస్థాయిలో పరిశీలిస్తామన్నారు.