AP: మొంథా తుఫాన్ ప్రభావిత ప్రాంత ప్రజలకు నిత్యావసర సరకుల పంపిణీకి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తుఫాన్ ప్రభావిత కుటుంబాలు, మత్స్యకారులకు ఉచితంగా పంపిణీ చేయనున్నారు. ప్రతి కుటుంబానికి బియ్యం 25 కిలోలు (మత్స్యకారులకు 50 కిలోలు), కందిపప్పు కిలో, నూనె లీటర్, ఉల్లిపాయలు కిలో, బంగాళాదుంపలు కిలో, చక్కెర కిలో పంపిణీకి ఆదేశాలిచ్చారు.