తూ.గో: ‘మొంథా’ తుఫాన్ కారణంగా మంగళవారం రాత్రి ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురవడంతో కిర్లంపూడి మండలం రాజుపాలెం రోడ్లో SLV ఇండస్ట్రీస్ దగ్గర రోడ్డుకి అడ్డంగా భారీ తాడిచెట్టు రోడ్డు మీద అడ్డంగా పడిపోయింది. దీంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీస్ సిబ్బంది ఆ చెట్టును తొలగించారు.