VKB: సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కుల్కచర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు కిరణ్ కుమార్ గౌడ్ అన్నారు. ఆయన మాట్లాడుతూ.. మొంథా తుఫాను ప్రభావంతో నిన్నటి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటివి జ్వరాలు ప్రబలుతాయని, పరిశుభ్రత పాటించడం, దోమల నివారణ చర్యలు తీసుకోవాలని సూచించారు.